by Suryaa Desk | Fri, Jan 03, 2025, 03:37 PM
దుబ్బాక నియోజకవర్గ మేరు సంఘం అధ్యక్షుడు దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన సంతోష్ ను బిఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ గురువారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేరు సంఘం అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న యువ నాయకుడు సంతోష్ ఎన్నిక కావడం పట్ల ఆయనను అభినందించారు.
సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తూ రానున్న రోజుల్లో జిల్లా, రాష్ట్రస్థాయి వరకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. చిన్న వయసులోని నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న సంతోష్ మేరు సంఘం బలోపేతానికి గ్రామస్థాయిలో పర్యటించి జిల్లా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పంచమి స్వామి, జర్నలిస్టులు నగేష్, రాజి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.