by Suryaa Desk | Fri, Jan 03, 2025, 04:35 PM
బిఆర్ఎస్ నాయకులంటే నే కమిషన్లకు కేరాఫ్ అడ్రస్ అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. గురువారం నారాయణాఖేడ్ లో మాట్లాడుతూ....కొందరు బిఆర్ఎస్ నాయకులు తమపై ఆరోపణలు చేస్తున్నారాని మండిపడ్డారు. గతంలో బిఆర్ఎస్ నాయకులు నల్ల వాగు ప్రాజెక్టు పనుల్లో కమిషన్లు తీసుకున్నారు. భూములు కబ్జాలు చెసి మరియు అమాయక ప్రజలదగ్గర కమిషన్ తీసుకున్న ఘనత బిఆర్ఎస్ నాయకులకె దక్కుతుందని అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి పథకాల్లో కమిషన్ తీసుకొని మరి పథకాలు అమలు చేశారాని అన్నారు.ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులను కూడా వదలకుండా వాళ్ళ దగ్గర కూడా కమిషన్ వసూలు చేసిన ఘనత బిఆర్ఎస్ నాయకులకు దక్కుతుందని అన్నారు.
బిఆర్ఎస్ అంటేనే కమిషన్ల పార్టీ అని అన్నారు.కాలేశ్వరం నుంచి పట్టుకొని నియోజకవర్గం లోని ఎమ్మెల్యే నుండి మంత్రుల వరకు ప్రతి ఒక్కరు కమిషన్ తీసుకున్నారని అన్నారు. బిఆర్ఎస్ నాయకులు అందరు కమిషన్ తీసుకున్నారని అందరు నాయకులు అలాగే ఉంటారని అనుకోవడం మనీ మూర్ఖత్వమని అన్నారు. చర్చకు నేను రెడీ మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా మీరు ఎక్కడ స్థలం డిసైడ్ చేసినా చర్చకు నేను సిద్ధం చర్చకు మీరు సిద్ధమా అని ఎమ్మెల్యే బిఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాటు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప షెట్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మరియు హనుమాoడ్లు,రాజేష్ చౌహన్,రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.