by Suryaa Desk | Fri, Jan 03, 2025, 03:26 PM
గురువారం హైదరాబాద్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచిన సంధర్బంగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షులు కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్, దుబ్బాక మున్సిపల్ యూత్ ఉపాధ్యక్షులు కడవెరుగు గోపి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
అనంతరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్బంగా దుబ్బాక నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా గెలుపు పొందిన కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ ని శాలువాతో సత్కరించి అభినందించారు. యువత రాజకీయాల్లో రాణించి రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.యువతకు ఎల్లప్పుడూ తన సహాయ,సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు.