by Suryaa Desk | Fri, Jan 03, 2025, 03:55 PM
రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాకు మంజూరు చేసిన నవోదయ పాఠశాలను అందోలు నియోజకవర్గంలో ఏర్పాటు అయ్యేలా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్ రాజనర్సింహ కషి చేశారు. ఈ విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభించాల్సి ఉండడంతో అందోలు నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల తరగతి గదులను జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు గురువారం పరిశీలించారు. పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించి వదిలిపెట్టిన భవన ంలోని తరగతి గదులు,, వంటశాల, మూత్రశాలలు సౌకర్యంగా ఉన్నాయా లేదా పరిశీలించారు. స్థానికంగా పరిశీలించిన విషయాలను జిల్లా కలెక్టర్‌కు నివేదిక ద్వారా తెలియజేయనున్నట్లు డీఈఓ తెలిపారు.
పుల్కల్ మండలం బస్వాపూర్‌లో నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్బంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పుల్కల్ మండలం బస్వాపూరు గ్రామ శివారులో సర్వే నంబరు 417లోని 30 ఎకరాలలో నవోదయ పాఠశాల నిర్మాణ పనులు జరగనున్నాయన్నారు. భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు జోగిపేటలో నవోదయ పాఠశాల తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. పాఠశాలను తాత్కాలికంగా నిర్వహించేందుకు అవసరమైన వసతుల విషయమై పణాళికలు రూపొందించి ప్రభుత్వానికి పంపుతామన్నారు. , సి ఎ ఓ వెంకటేశం, ఏ ఎం ఓ అనురాధ, మండల విద్యాధికారి బండి కష్ణ, జిల్లా పీఆర్‌టీయు అధ్యక్షుడు ఆకుల మాణయ్య, కాంప్లెక్స్ హెచ్‌ఎం నరేష్, ప్రాథమికొన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీరేశంలు డీఈఓ వెంట ఉన్నారు.