by Suryaa Desk | Fri, Jan 03, 2025, 03:35 PM
మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము ఏర్పాటు చేయాలని గురువారం జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ప్రాథమిక సహకార సంఘల సమన్వయ కార్యక్రమంలో మెట్లచిట్టాపూర్ సహకార సంఘ సభ్యులు కొమ్ముల రాజపాల్ రెడ్డి మరియు సభ్యులు పాల్గొన్నారు. రాజపాల్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటు మరియు సహకార సంఘల పునర్విభజన లో భాగంగా జగ్గాసాగర్ లో నూతనంగా ఏర్పాటు చేయాలని కోరారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటు సమన్వయ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మరియు డి సి ఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
మెట్ల చిట్టాపూర్ ప్రాథమిక సహకార సంఘం పరిధిలోని జగ్గాసాగర్ గ్రామంలో నూతన సహకార సంఘాన్ని కొండ్రికల్లా కొనరావుపేట్ రామల చెక్కపేట ఆత్మ నగర్ ఆత్మకు గ్రామాలతో కలిపి జగ్గాసాగర్ సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ కొమ్ముల రాజుపాల్ రెడ్డి సార గంగారెడ్డి ఇల్లెందుల శ్రీనివాస్ భోగ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.