by Suryaa Desk | Fri, Jan 03, 2025, 12:58 PM
చదువుల తల్లి, భారతదేశపు మెుట్టమెుదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ మహనీయురాలికి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో సావిత్రీ బాయి ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సామాజిక అసమానతలు, లింగ వివక్ష వంటి అనేక సామాజిక రుగ్మతలపై సావిత్రీబాయి పూలే అనేక పోరాటాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.సమాజ హితం కోసం ఆ మహనీయురాలు చేసిన సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. కాగా, మహిళలు, ఆడపిల్లల చదువు కోసం చేసిన విశేష సేవలకు గానూ ప్రతి ఏటా జనవరి 3న వారి సేవలు స్మరించుకుంటూ అధికారికంగా టీచర్స్ డే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.