by Suryaa Desk | Sat, Jan 04, 2025, 02:18 PM
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, రాబోయే మార్చి నెలలో జరిగే పదవ తరగతి పరీక్షల కోసం ఇప్పటినుండి ప్రణాళిక ప్రకారం విద్యార్థుల స్థాయిని పెంచి వారి సామర్థ్యాల ప్రకారం మంచి ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, పిల్లలకు స్నాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని, విద్యార్థులకు ప్రతిరోజు నిర్దేశించిన కార్యచరణ ప్రకారం సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాల వారీగా పరీక్షలు నిర్వహించాలని, ప్రతి పదవ తరగతి విద్యార్థి పాఠశాలకు వచ్చే విధంగా చూసుకోవాలని కలెక్టర్ సూచింaచారు. ఉన్నత పాఠశాలలోనే హెడ్ మాస్టర్ ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయులు పిల్లలను దత్తత తీసుకొని పదవ తరగతి పరీక్షలకు ప్రిపేర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. మాధవి, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త పిఎం షేక్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.