by Suryaa Desk | Fri, Jan 03, 2025, 11:15 AM
తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణలోని కొమురం భీం జిల్లా సిర్పూర్, గిన్నెదారిలో 6.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6.9, ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.1 కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరో రెండు రోజులు చల్లని గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలోని చింతపల్లిలో 7.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. లంబసింగి, పాడేరులో చలి వణికిస్తోంది.ఇక హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యంత కనిష్ఠంగా హెచ్‌సీయూలో 8.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బీహెచ్‌ఈఎల్ వద్ద 8.8, రాజేంద్రనగర్‌లో 9.4, మౌలాలీఓ 9.6, శివరామ్‌పల్లిలో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. దీంతో ప్రజలు చలికి వణికిపోయారు. శుక్రవారం రాత్రి కూడా ఇలాగే ఉంటుందని, ఉష్ణోగ్రతలు అతి తక్కువకు పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది.