by Suryaa Desk | Sat, Jan 04, 2025, 11:11 AM
భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలు ఇలా ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాల్ని అలంకరణగా భావిస్తూ.. ఇలాంటి సమయాల్లో ఎక్కువగా కొంటుంటారు. ఇంకా బంగారం అనేది పెట్టుబడులకు కూడా మంచి ఆప్షన్‌గా ఉంది. ఇక గోల్డ్, సిల్వర్ రేట్లు.. అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే మారుతుంటాయి. అక్కడ రేట్లు పెరిగితే ఇక్కడా పెరుగుతాయి. అక్కడ తగ్గితే ఇక్కడా తగ్గుతాయి. అక్కడ స్థిరంగా ఉన్నట్లయితే ఇక్కడా యథాతథంగానే ఉంటాయి. గోల్డ్, సిల్వర్ రేట్లపై అంతర్జాతీయంగా ఎన్నో అంశాలు ప్రభావం చూపుతుంటాయి. డాలర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంటుంది.ఇప్పుడు కొత్త సంవత్సరం వేళ పసిడి ధరలు వరుసగా పెరుగుతూ షాకిస్తున్నాయి. ఈ రోజు బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే 22 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేటు రూ.450 తగ్గడంతో తులం రూ. 72,150 వద్ద ఉంది. ఇక ఇదే సమయంలో 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన పుత్తడి ధర రూ. 490 తగ్గి ప్రస్తుతం 10 గ్రాములకు రూ.78,710 వద్ద కొనసాగుతోంది. ఇక దాదాపు వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న వెండి రేట్లు తాజాగా తగ్గాయి. ఈ క్రమంలో నేడు రూ.1000 తగ్గింది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కిలోకు రూ. 99000కు చేరింది.