by Suryaa Desk | Fri, Jan 03, 2025, 04:30 PM
మండలంలోనిమహబూబాబాద్ యం.ఎల్.ఏ. డాక్టర్ భూక్య మురళీ నాయక్ ను మర్యాద పూర్వకంగా కలిసిన మహబూబాబాద్ జిల్లా పాస్టర్స్ అండ్ లే లీడర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ పిల్లి కుమారస్వామి ఈరోజు మధ్యాహ్నం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యం.ఎల్.ఏ. క్యాంప్ కార్యాలయంలో యం.ఎల్.ఏ., డాక్టర్ భూక్య మురళీ నాయక్ ను మహబూబాబాద్ జిల్లా పాస్టర్స్ అండ్ లే లీడర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ పిల్లి కుమారస్వామి, మరియు పి.డి.యస్.యస్. స్వచ్చంద సంస్థా అధ్యక్షులు బనిశెట్టి వెంకటేష్ మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాతో సత్కరించారు.
అనంతరం గతంలో కేసముద్రంలోని క్రైస్తవ సమాజం కోసం ప్రత్యేకంగా స్మశాన వాటిక స్థలము ఏర్పాటు కొరకు విన్నవించిన విషయం ను జ్ఞాపకం చేసి, ఆ పనిని త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈవిషయం లో యం.ఎల్.ఏ. డాక్టర్ భూక్య మురళీ నాయక్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత తొందరగా క్రైస్తవ స్మశాన వాటిక స్థలము ఏర్పాటు పనిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు . ప్రజలందరి సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది అని అన్నారు.