by Suryaa Desk | Sat, Jan 04, 2025, 02:13 PM
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నెక్కొండ మండల శాఖ ఆధ్వర్యంలో నేడు 2025 డైరీ క్యాలెండర్ ను నెక్కొండ మండల విద్యాశాఖ అధికారిని వి రత్నమాల చేతుల మీదుగా , అలాగే జీఓ సంపుటినీ స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ రంగారావు ఆధ్వర్యంలో, టీఎస్ యుటిఎఫ్ సభ్యులు, జిల్లా కార్యదర్శి పాక శ్రీనివాస్ సమక్షంలో ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా ఎంఈఓ రత్నామాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘం ముందుగా డైరీ క్యాలెండర్ ను ఆవిష్కరించడం ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గత సంవత్సరం జీవో సంపుటిని ఈ సంఘం విడుదల చేయడం జరిగింది. అందరూ ఉపాధ్యాయులు చదవాల్సిందిగా కోరనైనది. మన నెక్కొండ మండలంలోని ఉపాధ్యాయులు అందరూ కూడా పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ముందుండాలని కోరడం, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని అందుకోసం ఉపాధ్యాయులు సాయి శక్తుల కృషి చేయాలని కోరడం జరిగినది.
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మన నిత్య జీవితంలో జరిగే ప్రతి సంఘటనను అద్దంలా ప్రతిబింబించడానికి రోజు మన దైనందిన కార్యక్రమాలను వ్రాసు కోవడానికి డైరీ ఎంతగానో ఉపయోగ పడుతుందని చాలా బాగుందని ఈ డైరీ ని ప్రతి ఒక్కరు వ్రాయాలని కోరడం జరిగినది. అలాగే తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘం అధ్యయనం అధ్యాపనం సామాజిక స్పృహ అనే లక్ష్యాలతో హక్కులు బాధ్యతలు రెండు నేత్రాలుగా భావిస్తూ ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తుందని సమస్యల సాధనలో వెనుకడుగు లేకుండా పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుత ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మెలో ఉండడం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వెంటనే వారి వారి డిమాండ్లు పరిష్కరించి వారిని వెంటనే విధులలోకి తీసుకోవాలని ముఖ్యంగా కేజీబీవీ ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలు వెంటనే తీర్చాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన డి ఎ లను పెండింగ్లో ఉంచకుండా వెంటనే మంజూరు చేయాలని పెండింగ్లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల బిల్లులన్నీ కూడా మంజూరు చేయాలని జిపిఎఫ్ పెండింగ్ బిల్లులను, పదవి విరమణ పొందిన ఉద్యోగుల గ్రాడ్యుటి వెంటనే మంజూరు చేసి పెన్షన్ అందించాలని 317 జీవోలో నష్టపోయిన ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించ పరిష్కరించాలని కోరారు అలాగే వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటు వంటి అలుగుబెల్లి నర్సిరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా వారు కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రఘురామయ్య ప్రధాన కార్యదర్శి రమేష్ మండల కార్యదర్శి కతీ జుల్ కుబ్రా మేడం , ఐలయ్య, కుమార్, లక్ష్మి ఇతర ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగినది.