by Suryaa Desk | Sat, Jan 04, 2025, 02:09 PM
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని చనుపల్లి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం జక్కేపల్లి గ్రామాల మధ్య పాలేరు వాగుపై 20 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన శిధిలావస్థకు చేరుకొని ప్రమాదపుటంచుల్లో రాకపోకలకు కేంద్రంగా మారింది.చనుపల్లి గ్రామస్తులు గ్రామం నుండి బయటికి వెళ్లాలంటే పాలేరు వాగును దాటి వెళ్లాల్సిందే.వాగు ఉప్పొంగినప్పుడు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి,గత 20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదాలు సంభవించకుండా పాలేరు వాగుపై ఒక వంతెన ఏర్పాటు చేసింది.ప్రస్తుతం నాణ్యత లోపించి ఫుట్ పాత్ మీద వేసిన బిళ్ళలు దెబ్బతినడంతో అది అత్యంత ప్రమాదకరంగా మారింది.ఈ వంతెన మీదుగా నిత్యం వందలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి.
అలాగే విద్యార్థులు స్కూల్ కు వెళ్తూ ఉంటారు.జరగరాని ప్రమాదం సంభవిస్తే దానికి బాధ్యులు ఎవరని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.నెర్రెలు బారి ఉన్న వంతెనపై ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు చేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోకవడంపై గ్రామస్తులు అగ్రహ వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెనపై ప్రమాదకరంగా ఉన్న ఫుట్ పాత్ బిళ్ళలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.