by Suryaa Desk | Fri, Jan 03, 2025, 11:29 AM
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై రణభేరి మోగించారు. ఈ విషయాల్లో గత కొన్నాళ్లుగా బీసీల్లో చైతన్యం తీసుకొస్తున్న ఆమె.. శుక్రవారం హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున బీసీ మహాసభ నిర్వహణకు ముందుకొచ్చారు. ప్రముఖ సంంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలే జయంతిని పురసరించుకొని ఇందిరాపారు వద్ద ఈ బీసీ మహాసభ నిర్వహించనున్నారు.కవిత పిలుపు మేరకు ఇప్పటికే వివిధ బీసీ, ప్రజాసంఘాలు మహాసభకు సంఘీభావం ప్రకటించాయి. తాజాగా గురువారం మరో రెండు సంఘాలైన విద్యార్థి జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన బీసీ మహాసభ కార్యక్రమానికి గురువారం సాయంత్రం వరకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడంపై బీసీ సంఘాల ప్రతినిధుల్లో ఆందోళన నెలకొన్నది. దీంతో ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి.
సావిత్రీబాయి జయంతి సందర్భంగా బీసీల కార్యక్రమంపై ఆంక్షలా? అని మండిపడ్డాయి. అందుబాటు లో ఉన్న బీసీ సంఘాల నేతలు ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకొని కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డీసీపీ సెంట్రల్ జోన్ ఆఫీస్ వద్ద పడిగాపులు కాసే దుస్థితిపై కవిత ఆగ్రహం వ్యక్తంచేశా రు. హైదరాబాద్ సీపీతో ఆమె ఫోన్‌లోమాట్లాడారు. ఆమె విజ్ఞప్తికి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సానుకూలంగా స్పందించారు. శుక్రవారం ఉదయం 11 నుంచి 4 గంటల వరకు ఇందిరాపార్ వద్ద జరిగే సభకు ఎట్టకేలకు అనుమతించారు.