by Suryaa Desk | Fri, Jan 03, 2025, 03:51 PM
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలో ని, గురువారం రోజున అయోధ్యాపురం ఉన్నత పాఠశాల పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు కీ.శే. కోడెం వెంకటేశ్వర్లు కుమారుడు, న్యాయవాది కొడెం శ్రీధర్, 35 మంది విద్యార్థులకు అల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ చేశారు. గురువారం రోజు సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమం లో, జిల్లా ఎ. రవీందర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు అందజేశారు. అదేవిధంగా తీగలవేణి ఉన్నత పాఠశాలలో, గూడూరు వాస్తవ్యులు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు చీర బిక్షపతి విజయలు, పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ వితరణ చేశారు. తదానంతరం స్థానిక తీగలవేణి గ్రామ వాస్తవ్యులు, వేం వెంకటా కృష్ణారెడ్డి పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం నిమిత్తం, ఐదువేల రూపాయలు అందించారు. ఇట్టి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు సక్రమంగా హాజరై, పట్టుదలతో చదువుతూ జరిగిన టెస్టులు పూర్తి సన్నద్దతతో సాధన చేసి వ్రాయాలని, ఎస్ఎస్సి ఫలితాలలో పదికి, పది శాతం సాధించే విధముగా కృషి చేయాలని కోరారు.
రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు చీరభిక్షపతి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు గ్రామీణ వెనుకబడిన విద్యార్థులు కావున బాగా చదువుకుని తమ తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలనే, తన వంతు సహాయంగా స్టడీ మెటీరియల్ అందించానని తెలిపారు. ఈ సందర్బంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని టీచర్లు చెప్పిన విషయాలను శ్రద్ధగా విని, 10/10 శాతంతో, ఎస్ఎస్సి పాస్ కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ, ప్రధానోపాధ్యాయులు రవికుమార్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, తీగలలేని ప్రధానోపాధ్యాయులు ఫారూఖ్, ఉపాధ్యాయులు షాహిద్ అలీ, కోడెమ్ రమాదేవి, జగదీశ్వర్, చంద్రమౌళి, శ్రీనివాస్, బిక్షపతి, రమేష్, వెంకటయ్య, లక్షపతి, ధర్మ, పురుషోత్తం, సాంబయ్య, సంపత్, నాగరత్నం, రాంప్రసాద్, రవి, రఫీ, పవన్, నవీన్ , కల్యాణి, జ్యోతి, లక్ష్మి రాణి మహేందర్ ప్రభాకర్ లు పాల్గొన్నారు.