by Suryaa Desk | Sat, Jan 04, 2025, 12:10 PM
హైడ్రాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి అడుగులు వేస్తోంది. అతి త్వరలో 970 కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. కొత్తగా వచ్చే అధికారులకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలో కూడా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ఏజెన్సీ ఒక సంవత్సరం పాటు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన 203 మంది మేనేజర్లు, 767 మంది అసిస్టెంట్లను నియమించనున్నారు.ఔటర్ రింగ్ రోడ్డు లోపల హైడ్రా పరిధిలో ఉన్న నీటి వనరులు, పార్కులు, ప్రభుత్వభూములు, నాలాలను రక్షించడంలో హైడ్రాకు సహాయం చేయడం, అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను గుర్తించడం వీరి బాధ్యతగా నిర్ణయించారు. హైదరాబాద్‌లోని ఫుట్‌పాత్‌లతో పాటు జలవనరులు, ప్రభుత్వస్థలాల్లో వెలసిన ఆక్రమణలను తొలగించడంలో వీరిదే కీలకపాత్ర అని అధికారులు చెప్పారు. ఎంపికైన అభ్యర్థులను ఏడు ప్యాకేజీలుగా విభజిస్తారు. మేనేజర్లకు రెండు, అసిస్టెంట్లకు ఐదు ప్యాకేజీలు ఉంటాయి. వీరి జీతాల కోసం మొత్తం ఖర్చు సంవత్సరానికి రూ.31.70 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.