by Suryaa Desk | Fri, Jan 03, 2025, 03:58 PM
పరిపాలనలో భాగంగా సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ నిర్వహించే భూముల సర్వే పటిష్టంగా జరిగేందుకు అవసరమైన సంపూర్ణ సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సర్వే ల్యాండ్ రికార్డ్ శాఖకు ఆధునిక పరికరాలు అందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆధునికరణ.
జిల్లాలో నిర్వహించే భూముల సర్వే నాణ్యత నైపుణ్యం పెంపుదలకు సర్వే శాఖకు ఒక డి.జి.పి.ఎస్, 6 రోవర్ లను అందించడం జరిగిందని, వీటిని వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు త్వరితగతిని అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి గంగయ్య,అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్ శ్రీనివాసులు, డి.ఐ గణపతి , తహసీల్దార్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.