by Suryaa Desk | Fri, Jan 03, 2025, 11:58 AM
హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి (Accident) గురైంది. శబరిమల ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది.దీంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతించారు. స్వాములు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన స్వాములను కొట్టాయం మెడికల్ కాలేజీ దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ఉన్నారని చెప్పారు.హైదరాబాద్ పాతబస్తీ, మాదన్నపేట, ఉప్పర్ గూడకు చెందిన అయ్యప్ప స్వాములు ప్రైవేటు బస్సులో శబరిమలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎరుమెలి నుంచి పంపా నది వెళ్తుండగా.. నదికి 15 కిలోమీటర్ల దూరంలో ఘాట్ రోడ్డులో మూలమలుపు వద్ద బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. మూడు చెట్లపై ఒరగడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ మరణించగా, బస్సులో ఉన్న స్వాములు గాయాలతో బయటపడ్డారు.