by Suryaa Desk | Fri, Jan 03, 2025, 03:41 PM
ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని గాజులపల్లి గ్రామ బీఆర్ఎస్ కార్యకర్త జనగామ దినేష్ రెడ్డి కూతురు జన్మదిన వేడుకలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి తెలంగాణ తల్లి ఫోటో జ్ఞాపికను అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. రాబోయే కాలంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని భరోసా కల్పించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని పార్టీకి కష్ట కాలంలో అండగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గౌరవం దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ సమన్వయ కర్త రణం శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రహీమోద్దీన్,మాజీ సర్పంచ్ లు మోహన్ రావు, అప్పవారు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు గాడి అంజి, సల్ల స్వామి, బ్రహ్మానంద రెడ్డి, నిఖిల్ రెడ్డి, ప్రేమ్ కుమార్, ఏసుప్రభు, కనక రాజు, తదితరులు పాల్గొన్నారు.