by Suryaa Desk | Fri, Jan 03, 2025, 04:13 PM
గుజరాత్ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ గాంధీనగర్ నందు జరిగే సీసీఎల్ సృజనాత్మక బోధన ప్రయోగ కార్యశాలకు స్థానిక కోహెడ మండలం లోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.రవివర్మ ఐదు రోజుల శిక్షణ లో పాల్గొన్నారు. ప్రయోగ పూర్వక అభ్యసనం, ఆట వస్తువుల ద్వారా, పరిసరాలలో నిరుపయోగ వస్తువుల ద్వారా సైన్స్, గణిత అంశాలను తయారుచేయడంలో మెళకువలు తెలుసుకోవడం, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన విద్యా వేత్తలతో సమష్టిగా పాల్గొని అభ్యసన సామగ్రి తయారీలో శిక్షణ తీసుకోవడం జరుగుతుంది.వృతంతర శిక్షణ అనేది వృత్తి నైపుణ్యాలను పెంపొందిస్తూ పాఠశాల అభివృద్ధి కి తోడ్పాటు అందిస్తుందని రవివర్మ పేర్కొన్నారు.
పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తులను వెలికి తీసేలా ఉండి, ప్రతి వస్తువుతో ఒక శాస్త్రీయంగా ఆలోచన కలుగుతుంది అని తెలిపారు.విద్యార్థుల కు వివిధ రకాల ఫజిల్స్ ఆడించడం, గాలి పీడనం, నీటి పీడనం, యాంత్రిక వస్తువులను తగిన సూచనలు ద్వారా పరికరాల తయారీలో అవగాహన పొందడం పట్ల ఆ విజ్ఞానం అందరి పాఠశాలల్లో అన్వయించే విధముగా ఉంటుంది అని ఎంఈఓ ఆర్.పద్మయ్య అభినందించారు...పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, వింజపల్లి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.