by Suryaa Desk | Fri, Jan 03, 2025, 03:24 PM
గత కొద్ది నెలలుగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పులి ఎట్టకేలకు చంద్రపూర్ అటవీ అధికారులు బోనులో బంధించారు. గత కొద్ది నెలలుగా ఈ అటవీ ప్రాంతాల్లోనే తిరుగుతున్న పెద్దపులి రహదారి వెంట రెగ్యులర్గా తిరుగుతుండడంతో వేటగాళ్ల దృష్టి పడే ప్రమాదము ఉండడంతో చాకచక్యంగా వ్యవహరించి దాదాపు వారం.
రోజులుగా శ్రమించి పులిని ఎట్టకేలకు బోను లో బంధించి చంద్రాపూర్ కు తరలించారు అటవీ శాఖ అధికారులు. సిర్పూర్ టీ మండలంలోని మాకిడికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో అంతర్గాం అటవీ ప్రాంతంలో పులిని బోనులో బంధించారు. మత్తు మందు ఇచ్చి బంధించిన పులికి అవసర మైన వైద్యం అందించిన తర్వాత తడోబా పులుల సంరక్షణ కేంద్రంలో వదిలి పెట్టనున్నట్లు తెలుస్తోంది.