by Suryaa Desk | Fri, Jan 03, 2025, 03:48 PM
యువతతోటే భారతదేశానికి, తెలంగాణ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉంటుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి నివాసంలో నూతన సంవత్సర పర్వదినాన్ని పురస్కరించుకొని పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నేతలు పుష్పగుచ్చాలని అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ నేతలు పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని అన్నారు. మీ యువతతోటే కాంగ్రెస్ పార్టీకి బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. మీ అందరికీ నేను అండగా ఉంటానని పార్టీ బలోపేతంలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో ఆత్మకూర్ మండల యూత్ అధ్యక్షుడు తనుగుల సందీప్,దామేర మండల యూత్ అధ్యక్షులు నల్ల సుధాకర్, పోలేపాక ప్రశాంత్, బాగాది రమేష్ తదితరులు పాల్గొన్నారు.