by Suryaa Desk | Fri, Jan 03, 2025, 04:00 PM
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసిన గ్రామస్తులు..పోలీసులకు అప్పగించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా థరూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన కుటుంబం.. బతుకుదెరువు కోసం కొద్ది నెలల కిందట మొయినాబాద్‌కు వలస వచ్చింది.ఆ కుటుంబం మొయినాబాద్ పెద్ద మంగళారంలోని ఓ విధిలో అద్దెకు ఉంటున్నారు. వీరి చిన్న కుమార్తె (4) గురువారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటోంది. అదే గ్రామానికి చెందిన కైలాస్ (40) ఆ సమయంలో అటుగా వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న కైలాస్.. ఆ బాలికను పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లాడు. అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.ఇది గమనించిన బాధితురాలి అక్క.. వెంటనే వెళ్లి తన నాన్నకు జరిగిన విషయం చెప్పింది. ఆ తండ్రి వెంటనే వెళ్లి కైలాస్‌ను పట్టుకున్నాడు. అక్కడికి చేరుకున్న స్థానికులు.. కైలాస్‌ను చితకబాదారు. అనంతరం మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. బాధిత కుటుంబం ఫిర్యాదులో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ గండిపేటలో గురువారం ఓ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.64 లక్షలు జీఎస్టీ చెల్లించాలంటూ.. ఆ శాఖ అధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు.. కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వామి ఆరోపించారు. సేమ్ జీఎస్టీ నంబరుతో మరొకరు ఇతర వ్యాపార లావాదేవీలు చేశారని, అందుకు సంబంధించి భారీగా పన్ను కట్టాల్సి రావడంతో ఈ దారుణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.న్యూఇయర్ వేడుకల్లో కొకైన్ అమ్మేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌కు చెందిన జహవర్ కిషన్ గోపాల్.. ప్లాస్టిక్ వ్యాపారంలో నష్టపోయాడు. స్నేహితులు అనీల్, వరుణ్, ప్రమోద్ సూచనతో మాదక ద్రవ్యాలను తెచ్చి విక్రయించాలనుకున్నాడు. ముంబయికివెళ్లి ఓ నైజీరియన్ నుంచి డ్రగ్స్ కొని తీసుకొచ్చాడు. కొకైన్ విక్రయించే ప్రయత్నంలో ఉండగా.. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.8 లక్షల విలువైన కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసున్నారు.