by Suryaa Desk | Fri, Jan 03, 2025, 04:22 PM
కొల్లాపూర్ పట్టణంలో స్థానిక విశ్వశాంతి వెల్ఫేర్ సొసైటీ వృద్ధాశ్రమంలో సమాచార హక్కు చట్టం రక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజీమ్ మహమ్మద్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వృద్ధమాతలకు శీతాకాల స్వెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం రక్షణ సమితి ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకంగా ఉందని ఆయన అన్నారు.
పుట్టినరోజు సందర్భంగా వృద్ధమాతల ఆశీర్వాదాలు గొప్ప విషయమని వారి సమక్షంలో ఈ పుట్టినరోజుకు వేడుకలు సభ్యులు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్ కార్యదర్శి పగిడిమర్రి యాదగిరి కోశాధికారి ఆనంద్ కార్యవర్గ సభ్యులు సుకుమార్ ప్రకాష్ మైనుద్దీన్ వృద్ధాశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.