by Suryaa Desk | Sat, Jan 04, 2025, 12:59 PM
పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీలకు చెందిన 125 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన ఒక కోటి 25 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో అరులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తహసీల్దార్లు రంగారావు, రాధ, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.