by Suryaa Desk | Fri, Jan 10, 2025, 09:53 PM
గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రజలకు మంచి ప్రాథమిక వైద్యాన్ని అందించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. షాద్ నగర్ ధన్వంతరి గ్రామీణ వైద్య సంఘం అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో శుక్రవారం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను స్థానిక ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శంకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ పాల్గొన్నారు.