by Suryaa Desk | Fri, Jan 10, 2025, 09:13 PM
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సొంత ఊరిలో సంక్రాంతి పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకొనేందుకు సొంత వాహనాల్లో బయలుదేరడంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. తెలంగాణలో శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా కార్లు, ఇతర వాహనాల్లో బయలు దేరారు. దీంతో శుక్రవారం వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో NH 65 రద్దీగా మారింది.