by Suryaa Desk | Fri, Jan 10, 2025, 09:35 PM
TG: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానం, హరిహర క్షేత్రంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం నుండి భక్తులకు శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, లక్ష్మీ సమేత అనంతపద్మనాభ స్వామి వారు దర్శనమిచ్చారు. అనంతరం స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు రావడంతో.. ఆలయం సందడిగా మారింది.