by Suryaa Desk | Mon, Nov 04, 2024, 02:18 PM
దౌల్తాబాద్: మండలంలోని గాజులపల్లి గ్రామంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ తో మారుపాక అర్జున్ ఇల్లు దగ్ధం కావడంతో విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదివారం గ్రామంలో పర్యటించి విద్యుత్ షాక్ తో ఇల్లు దగ్దమైన విషయాన్ని బాదిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో ఇల్లు దగ్ధం కావడం పట్ల ఆయన తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. ఇల్లు దగ్ధమైన విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి సహాయం అందే విధంగా కృషి చేస్తానని బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ అప్ప వారి శ్రీనివాస్. మాజీ సర్పంచ్ బొల్లి చంద్రం. దౌల్తాబాద్ మండల టిఆర్ఎస్ యువజన శాఖ అధ్యక్షులు రాజేందర్. మండల నాయకులు పంజా స్వామి. అంజి తదితరులున్నారు.
సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి దళారుల పాలవుతున్న పత్తి రైతుల కష్టాలు రైతులు ఎంతో కష్టపడి పత్తి పంటను పండించినప్పటికీ సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని దీంతో దళారులకు వరంగా మారిందని అధికార యంత్రాంగం వెంటనే స్పందించి సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
డిమాండ్ చేశారు. ఆదివారం రాయపోల్ మండలం తిమ్మక్కపల్లిలో ఆయన మాట్లాడుతూ సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారుల పాత్ర ఇష్టారాజ్యంగా మారిందని క్వింటాల్ పత్తికి రూ.5000 నుంచి 6500 వరకు చెల్లిస్తున్నారని. సిసిఐ ద్వారా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే 7500 పైగా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని ఆయన గుర్తు చేశారు. సిసిఐ కొనుగోలు కేంద్రాల వద్ద పచ్చి రైతులకు అదనంగా చెల్లించాలని. ప్రస్తుతం పత్తి కొనుగోలు చేస్తున్న దళారులు రైతులను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆయన విమర్శించారు. రుణమాఫీ. రైతు భరోసా ఇప్పటికి అమలు కాకపోవడం రైతులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని ఆయన పేర్కొన్నారు.