by Suryaa Desk | Mon, Nov 04, 2024, 02:55 PM
సిక్కుల హక్కుల రక్షణకు నిరంతరం కృషి చేస్తానని ఉత్తర తెలంగాణ అధ్యక్షులు సర్దార్ రంజిత్ సింగ్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని గురునానక్ గార్డెన్ లో 10 జిల్లాల సిక్లిగర్ (సిక్కు) కుల సంఘంసమావేశం నిర్వహించారు. సమావేశంలో పట్టణానికి చెందిన సర్దార్ రంజీత్ సింగ్ ను ఉత్తర తెలంగాణ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం అయన మాట్లాడుతూ.. సిక్కుల్లో కూడా చాలా మంది పేదలున్నారని, వారికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది కలిగేలా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కొరతమన్నారు. అనంతరం 10 జిల్లాల అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సమావేశం లో 10 జిల్లాల సిక్లిగర్ అధ్యక్షులు దేశాయ్ సింగ్, సంతోక్ సింగ్, చతర్ సింగ్, ప్రతాప్ సింగ్, ధ్యాన్ సింగ్, కిర్ పాన్ సింగ్, రామ్ సింగ్, జగన్ సింగ్, ఇంద్రజిత్ సింగ్, జిందాల్ సింగ్, జీత్ సింగ్, అనిల్ సింగ్, జితేందర్ సింగ్, రామారావు సింగ్ తదితరులు పాల్గొన్నారు.