by Suryaa Desk | Mon, Nov 04, 2024, 02:12 PM
అందోలు మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరికొనుగోలు కేంద్రాలను అడిషనల్ డీఆర్డీఓ జంగారెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కేంద్రాల్లో రైతులు కష్టపడి పండించిన ««ధాన్యంను కేంద్రాల్లో తూకం వేయిస్తున్నారా? లేదా? తేమ శాతం పేరుతో తూకం వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారా? అడిగి తెలుసుకున్నారు.
మండలం పరిధిలోని అన్నాసాగర్ లోని కేంద్రంలో రైతులతో ఆయన స్వయంగా మాట్లాడి ఏమైనా సమస్యలున్నాయా అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో కొనుగోలు చేస్తున్న తేమ శాతంను ఆయన స్వయంగా పరిశీలించారు. సెంటర్ లో అన్ని పరికరాలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. రైతులకు పలు సూచనలు చేశారు. అడిషనల్ డీఆర్డీఓతో పాటు ఏపీఎం మాణిక్యం, సీసీ మమత వీఓఏ లక్ష్మిలు పాల్గొన్నారు.