by Suryaa Desk | Mon, Nov 04, 2024, 02:14 PM
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తలపెట్టిన బీజేపీ(BJP) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని 22500 సభ్యత్వలతో విజయవంతం చేస్తున్నారని బిజెపి పార్టీ వరంగల్ జిల్లా ప్రధానకార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నిర్వహించిన పత్రిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉన్న బీజేపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేస్తూ. మోడీ నాయకత్వం దేశానికి అవసరమని ప్రజలు గుర్తించారని, అందుకే మూడోసారి ప్రధానిగా అవకాశం ఇచ్చారన్నారు. 10 సంవత్సరాల క్రితం అభివృద్ధిలో, మౌళిక వసతుల కల్పనలో 70 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ విఫలమైందని, ఉచిత బియ్యం, ఉచిత గ్యాస్, ముద్ర రుణాల వంటి సంక్షేమ పథకాలను బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. బీజేపీలో సభ్యునిగా చేరడం ప్రతి ఒక్కరికి గౌరవమన్నారు. సభ్యత్వ నమోదులో జిల్లాలోనే నర్సంపేట నియోజకవర్గం మొదటి స్థానంలో నిలుస్తుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీలో సభ్యత్వం కొత్త కార్యక్రమం కాదని అన్నారు యువతను అత్యధికంగా సభ్యత్వంలో భాగస్వామ్యం చేశామన్నారు.
తెలంగాణలో 2028లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు క్రియాశీల సభ్యత్వం నర్సంపేట నియోజకవర్గం నుండి 145 మంది క్రియాశీల సభ్యత్వం పొందారు అని అన్నారు.ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి అహర్నిశలు కష్టపడి పని చేసిన మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు మరియు వివిధ మోర్చాల నాయకులకు, మహిళా మోర్చ సోదరీమణులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
రానున్న గ్రామపంచాయతీ ఎలక్షన్లో 100కు 100% ప్రతి గ్రామము నుండి సర్పంచ్ అభ్యర్థులు మరియు పోటీ బరిలో నిలబడతారని అన్నారు ఈసారి గ్రామపంచాయతీ ఎలక్షన్ లో అత్యధిక శాతం యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ఇట్టి కార్యక్రమంలో.......
వరంగల్ జిల్లా ఎస్టి మోర్చా అధ్యక్షులు భానోత్ వీరన్న, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి,17వ వార్డు కౌన్సిలర్ గోల్యా నాయక్, దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షులు నేదురు రాజేందర్, చెన్నారావుపేట మండల అధ్యక్షులు దుంకదువ్వ రంజిత్, నర్సంపేట రూరల్ మండల అధ్యక్షులు గంగిడి మహేందర్ రెడ్డి, నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శిలు కొంపెల్లి రాజేందర్,గూడూరు సందీప్, వరంగల్ జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, యువ మోర్చ జిల్లా కార్యదర్శి ఎర్ర రాజు, నర్సంపేట మండల ప్రధాన కార్యదర్శి తాళ్ళపెళ్లి రాము, కొనుకటీ నవీన్, తౌటం నిశాంత్,వరంగల్ జిల్లా మహిళా మోర్చా నాయకురాలు సూత్రపు సరిత, నర్సంపేట పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు మార్త సంధ్యారాణి,సీనియర్ నాయకులు పొదిళ్ల రామచందర్ మరియు బిజెపి కుటుంబ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు.