by Suryaa Desk | Mon, Nov 04, 2024, 03:19 PM
ఆదివారం రోజున సిపిఎం దేవరకొండ మండల కమిటీ సమావేశం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.ఈసమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిలు దరలు తగ్గుతున్న భారత దేశంలో యధావిధిగా కొనసాగుతున్నాయని వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజల పైన ఆర్థిక భారాలు మోపబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం మూలంగా వాటి మీద ఆధారపడి తయారవుతున్న నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి అవి కొనలేని పరిస్థితుల్లో పేదలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాలలోఈ కాలంలో మతోన్మాద రాజకీయాలతో పాటు కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ రంగ సంస్థల్ని చౌక ధరకు ధారాధత్వం చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల్ని వీధిన పడేసే పద్ధతుల్లో కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం, ఊడిగం చేస్తుందని ఉపయోగపడుతుందని విమర్శించారు .బ్యాంకింగ్ ఎల్ఐసి రైల్వే విమానాయన రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయటానికి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తుందని వెంటనే ప్రైవేటు విధానాలను విడనాడి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య మండల కార్యదర్శి నల్ల వెంకటయ్య మండల నాయకులు బిజిలి లింగయ్య,బుడిగ వెంకటేష్,ఎండి రహీం,నల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.