by Suryaa Desk | Tue, Nov 05, 2024, 04:33 PM
చలి దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా దుప్పట్లు పంపిణీ చేయాలి ప్రజావాణిలో ఫిర్యాదులలతో కూడిన వినతి పత్రం జిల్లా కలెక్టర్ కి అందజేసిన ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకత్వం. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులకు సంబంధించిన హాస్టల్లో మెనూ ప్రకారం పలు వార్డెన్లు భోజనం అందించడం లేదు వార్డెన్ లో స్థానికంగా ఉండాలన్న నిబంధన ఉన్న పలువురు ఉండడం లేదు దానికి జిల్లా స్థాయి అధికారులు కనీస పర్యవేక్షణ లేకుండా పోయి తొత్తుగా మారి వార్డెన్ లకు సహకరిస్తున్నారని ఆన్నారు కూరగాయలు వంట సామాగ్రి సంబంధించి నాణ్యత లోపిస్తున్నాయి మరియు విద్యార్థులకు సంబంధించి సొంత భవనాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు బీసీ గర్ల్స్ హాస్టల్లో 200 పైన విద్యార్థులు హాస్టల్ విద్యను అభ్యసిస్తున్నారు సరైన టాయిలెట్స్ లేవు మరొక హాస్టల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పోలీసు వారు హెడ్ కోటర్ సంబంధించి బిల్డింగు ఎస్టీ హాస్టల్ కు సంబంధించింది దాన్ని తక్షణమే ఖాళీ చేయించాలి ఎన్నోసార్లు గత అధికారులు దృష్టికి తీసుకువచ్చిన ఇప్పటికీ అది ఖాళీ చేయలేదు ఎస్టి ప్రీమెట్రిక్ పోస్టు మెట్రిక్ విద్యార్థులు ఒకే భవనంలో ఉంటున్నారు అలాగే ఎస్సీ వన్ టు ప్రీ మెట్రిక్ విద్యార్థులు కూడా ఓకే భవనంలో ఉంటున్నారు. చలికాలం ప్రారంభమైంది విద్యార్థులకు అందిచాల్సిన దుప్పట్లు వంటి సామాగ్రిని తక్షణమే అందించాలి అదే విధంగా జగిత్యాల పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ (బాలికల) కళాశాలలో విద్యార్థులకు సరిపడా గదులు లేవు శిథిలావస్థలో ఉన్నాయి అట్లాగే టాయిలెట్ సమస్యలు ఉన్నాయి విద్యార్థులకు సరిపడలేవు మరియు తలపులు కిటికీలు కూడా లేవు చల్లా చదరంగా ఉన్నాయి బాగు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి ఆఫీస్ కార్యాలయం జగిత్యాల మన సమీకృత భవనంలోకి మర్చబడినప్పటికీ ఒక గది ఇప్పటికీ కళాశాల లోనే ఉంది దాన్ని ఖాళీ చేయించాల్సిన అవసరం ఉంది విద్యార్థులకు ఒక గది అందుబాటులోకి వస్తుంది.
అదేవిధంగా ప్రభుత్వ బాలికల పాఠశాల కు సంబంధించి విద్యార్థులకు సరిపడ గదులు లేవు బిల్డింగు కూల్చి రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పటికీ దాన్ని నిర్మించిన దాఖలు లేవు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గత కలెక్టర్లు వచ్చి నిర్మిస్తామని వాగ్దానం చేసినప్పటికీ ఇప్పటికీ ఇంకా నిర్మాణం కూడా లేదు దీనివల్ల పేద విద్యార్థులు తరగతి గదులు లేక ఇరుకు గదుల్లో విద్యను అభ్యసిస్తూ ఇబ్బందులకు గురవుతూ చదువుకు దూరం అయ్యే పరిస్థితి నెలకొంది విద్యార్థులకు అసలు కనీస మరుగుదొడ్లు కూడా లేవు మరియు పక్కనే ఉన్న ఆనంద నిలయంలో ఉన్న వాటిని విద్యార్థులు ఉపయోగిస్తున్నారు.
అధికారులు తక్షణమే స్పందించి పై సమస్యలు పరిష్కారానికి కార్యచరణ రూపొందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించ గలరని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) గా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రూరల్ మండల కార్యదర్శి నితిన్ మచ్చ, సహాయ కార్యదర్శి తోట రాజేష్, ప్రణయ్, అరుణ్ కుమార్, నరేష్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.