by Suryaa Desk | Mon, Nov 04, 2024, 03:13 PM
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రజల కష్టాలు నెరవడం లేదని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా ఉమ్మడి వెల్గటూర్ మండలంలోని మారేడుపల్లి గ్రామం నుండి చెగ్యాం గ్రామపంచాయతీ శాలపల్లె ఉన్న రహదారి ప్రమాదంగా మారిందని ప్రయాణికులు స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు పది సంవత్సరాల కాలం నుండి ఇప్పటివరకు ఈ రోడ్డు గురించి పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి ఈ సమస్య గురించి ప్రజలు విన్నయించగా రోడ్డు నూతన నిర్మాణానికి ప్రోసిడింగ్ పత్రాలు విడుదల చేశారు.
అయితే ప్రభుత్వం మారడంతో ప్రజల కష్టాలు అలానే ఉన్నాయి. ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తాను గెలిచిన వెంటనే రోడ్డు నూతన నిర్మాణ పనులు ప్రారంభిస్తానని చెప్పినట్లు అక్కడి స్థానిక ప్రజల ఆరోపిస్తున్నారు. నిత్యం రెండు డిపోలకు సంబంధించిన బస్సులు ఇదే రోడ్డుపై ప్రయాణం సాగిస్తాయి. దాదాపు ఆరు గ్రామాల ప్రజలు ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే జంకుతున్నారు. ప్రమాదాలకు నిలయంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ సమస్యపై దృష్టి సారించి వెంటనే రోడ్డు నూతన నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.