by Suryaa Desk | Tue, Nov 05, 2024, 04:48 PM
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని పలు గ్రామాల మాజీ సర్పంచ్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేసినారు.మాజీ సర్పంచ్ నల్ల శ్యామ్ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పిలుపునిచ్చిన తెలంగాణ రాష్ట్ర మాజీ సర్పంచుల అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడానికి హైదరాబాద్ కు బయలుదేరిన విషయం తెలుసుకున్న పోలీసులు గొల్లపల్లి మాజీ సర్పంచులను అరెస్ట్ చేసినారు.
మాజీ సర్పంచుల బాధలు సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి వినతి పత్రం ద్వారా కష్టాలు చెప్పుకునే హక్కు కూడా లేదా ఈ తెలంగాణ రాష్ట్రంలో అని నిరసన వ్యక్తపరిచిన సర్పంచులు.ఈ కార్యక్రమంలో కందుకూరి సత్తయ్య,రాగం శంకరయ్య,పెంచాల తిరుపతి,గంగాదేవిపల్లి సర్పంచు పాల్గొన్నారు.