by Suryaa Desk | Mon, Nov 04, 2024, 02:10 PM
కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాయపోల్ మండలం రామారం గ్రామానికి చెందిన 40 మంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మండల పార్టీ అధ్యక్షులు తప్పేట సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొల్లపల్లి కనకయ్య ఆధ్వర్యంలో దుబ్బాక ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో హైదరాబాదులోని ఆయన నివాసంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, బిజెపి పార్టీలు పేద ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని, బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో పేద ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారన్నారు. అందుకే ఆ పార్టీ ని పక్కకు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంచుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..