by Suryaa Desk | Tue, Nov 05, 2024, 04:44 PM
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరాపూర్ గ్రామానికి చెందిన జంగం అజయ్ మతిస్థిమితం లేకపోవడంతో గత ఐదు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోవడం జరిగింది.సోమవారం రోజున స్టేషన్ సమీపంలో అనుమానస్పద స్థితిలో కనిపించడంతో మహిళా కానిస్టేబుల్ సౌజన్య గమనించి యువకున్ని దగ్గరికి వెళ్లి తన వివరాలు అడగడంతో తన పేరు జంగం అజయ్,తండ్రి పేరు అంజయ్య మీరాపూర్ గ్రామం.
అని తెలుపడంతో గ్రామస్తుల సహాయంతో కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని స్టేషన్ కి పిలిపించి యువకున్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది.ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్ సౌజన్య కి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కనకయ్య,మహిళా కానిస్టేబుల్ సౌజన్య, కానిస్టేబుల్ అరుణ్ పాల్గొన్నారు .