by Suryaa Desk | Mon, Nov 04, 2024, 02:58 PM
గత పదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఈ సందర్భంగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధి 19వ వార్డ్ లో దాదాపు కోటి రూపాయల సీఎస్ఆర్ నిధులతో నూతనంగా చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని, రానున్న రోజుల్లో కూడా శివారు మున్సిపాలిటీలను ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బెంబడి బుచ్చి రెడ్డి, శంభీపూర్ కృష్ణ, మురళీ యాదవ్, సింహపురి కాలనీవాసులు దేవేందర్ రెడ్డి, దశరధ్ రెడ్డి, సందీప్ రెడ్డి, మనీవర్ధన్, రవీంద్ర, సందీప్ రావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ రెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు.