|
|
by Suryaa Desk | Mon, Jan 19, 2026, 03:31 PM
వీధి కుక్కల దాడి, వాటిని తరలించాలనే పిటిషన్లపై డాగ్ లవర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వందలాది కుక్కలను ఇంజెక్షన్లతో చంపడాన్ని వ్యతిరేకిస్తూ రేణూ దేశాయ్, యాంకర్ రష్మీ గౌతమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. "ఇప్పుడు కుక్కలు రేపు మనుషులు" అని రష్మీ ఆవేదన వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు తీర్పు రాకముందే చట్టాన్ని చేతిలోకి తీసుకుని మూగజీవాలను చంపడం బాధాకరమని, దీనికి పరిష్కారాలుండాలని, అయితే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఆమె కోరింది. ఇతర దేశాల్లో ఉన్నట్లు వీధి కుక్కలకు ఆశ్రయం కల్పించాలని ఆమె అన్నారు.
Latest News