|
|
by Suryaa Desk | Thu, Nov 16, 2023, 11:36 AM
మల్లెల వాన మల్లెల వాన నాలోన
మనసంతా మధుమాసంలా విరబూసేనా
మల్లెల వాన మల్లెల వాన నాలోన
మనసంతా మధుమాసంలా విరబూసేనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా
కోయిల సంగీతంలా కిలకిలాలే వినిపించేనా
తేనెల జలపాతంలా సరదాలే చెలరేగేనా
విరిసే అరవిందాలే అనిపించేనా
మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా
మల్లెల వాన మల్లెల వాన నాలోన
మనసంతా మధుమాసంలా విరబూసేనా
చిన్న చిన్న సంగతులే సన్నజాజి విరిజల్లు
తుళ్లుతున్న అల్లరులే ముళ్ళు లేని రోజాలు
అందమైన ఆశలే చిందులాడు ఊహలే నందనాల పొదరిల్లు
గుప్పెడంత గుండెలో గుప్పుమన్న ఊసులే చందనాలు వెదజల్లు
ఓ వన్నెల పరవళ్లు పున్నాగ పరిమళాలు
వయసే తొలి చైత్రం చూసే సమయానా
మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా
మల్లెల వాన మల్లెల వాన నాలోన
మనసంతా మధుమాసంలా విరబూసేనా
కొమ్మ లేని కుసుమాలు కళ్ళలోని స్వప్నాలు
మొగలిపూల గంధాలు మొదలయ్యేటి బంధాలు
కోరుకున్న వారిపై వాలుతున్న చూపులే పారిజాత హారాలు
అరె ముద్దు గుమ్మా ఎదలో మొగ్గ వీచు కథలే ముద్దమందారాలు
హ నిత్య వసంతాలు ఈ పులకింతలా పూలు
ఎపుడు వసివాడని మనమై హృదయాన
మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా
మల్లెల వాన మల్లెల వాన నాలోన
మనసంతా మధుమాసంలా విరబూసేనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా
కోయిల సంగీతంలా కిలకిలాలే వినిపించేనా
తేనెల జలపాతంలా సరదాలే చెలరేగేనా
విరిసే అరవిందాలే అనిపించేనా
మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా