by Suryaa Desk | Sun, Dec 29, 2024, 03:41 PM
స్టార్ దర్శకుడు శంకర్ – గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10, 2025న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఐతే, ఈ పొలిటికల్ డ్రామా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ ను ఎలా కట్ చేస్తారు ?, చరణ్ రెండు పాత్రలను ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు ? అంటూ ఫ్యాన్స్ లో ఇప్పటికే చర్చ మొదలైంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ పై ఓ న్యూస్ బాగా వినిపిస్తోంది.ఎలాగూ ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషనల్ యాక్టివిటీస్ ను కూడా పెంచారు కాబట్టి, ఈ క్రమంలో ట్రైలర్‌ను కూడా విడుదల చేయాలని పలువురు నెటిజన్లు మేకర్స్ ను కోరుతున్నారు. కాగా తాజా అప్ డేట్ ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను జనవరి 4, 2025న ప్రత్యేక ఈవెంట్ సందర్భంగా విడుదల చేస్తారని తెలుస్తోంది. అయితే, ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.ఇక సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. మరో కీలక పాత్రలో అంజలి కనిపించనుంది. అన్నట్టు గేమ్ ఛేంజర్ నార్త్ ఇండియా థియేటర్స్ రైట్స్ ను అనిల్ తడాని యొక్క AA ఫిల్మ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Latest News