by Suryaa Desk | Mon, Dec 30, 2024, 10:56 AM
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ మిల్క్ బ్యూటీ భాషతో సంబంధం లేకుండా సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. హ్యాపీడేస్ , రచ్చ, ఎందుకుంటే ప్రేమంటే ఊసరవెల్లి, రెబల్, బద్రీనాథ్, కెమెరామెన్ గంగగంగతో తో రాంబాబు, తడాఖా, బెంగాల్ టైగర్, బాహుబలి, సైరా నరసింహారెడ్డి, స్త్రీ 2, భోళా శంకర్, జైలర్ వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో గొప్ప గుర్తింపు దక్కించుకుంది. అంతేకాకుండా తమన్నా ఐటెమ్ సాంగ్స్‌లో కూడా అదరగొడుతోంది. సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15ఏళ్లు పూర్తయినా, ఇప్పటికీ రోజూ కొత్తగానే అనిపిస్తుంటుందని నటి తమన్నా తన తాజా ఇంటర్వ్యూలో అన్నారు. "చాలా మంది మీరు ఆనందంగా ఉండేందుకు ఏం చేస్తుంటారని అడుగుతుంటారు. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో నేను ఎప్పుడూ దాని కోసం వెతకలేదు. ఎందుకంటే నా వృత్తే నాకు ఆనందాన్నిస్తుంది." అని ఆమె చెప్పారు. పరిశ్రమలో అవమానాలు, విమర్శలు ఎదురయ్యాయని, కానీ ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదన్నారు.
Latest News