by Suryaa Desk | Mon, Dec 30, 2024, 02:47 PM
టాలీవుడ్ యంగ్ కపుల్ అక్కినేని నాగచైతన్య- శోభిత ప్రధాని నరేంద్ర మోదీకి థాంక్స్ చెప్పారు. ఆయన నుంచి ప్రశంసలు పొందడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు చైతన్య దంపతులు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. మరి మోదీకి చైతన్య- శోభిత కపుల్ ఎందుకు థాంక్స్ చెప్పారంటే? ...ప్రధాని మోదీ తాజాగా 'మన్‌కీ బాత్' కార్యక్రమంలో మాట్లాడారు. ఈ ప్రోగ్రామ్‌లో అక్కినేని నాగేశ్వరరావును మోదీ గుర్తు చేసుకున్నారు. ఆయన సినీ పరిశ్రమకు చేసిన కృషిని ప్రధాని కొనియాడారు. 'ఏయన్నార్ తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలను చాలా చక్కగా చూపించేవారు' అని మోదీ అన్నారు. దీనిపై స్పందించిన నాగచైతన్య దంపతులు మోదీకి థాంక్స్ చెబుతూ పోస్ట్‌లు షేర్ చేశారు.
'అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్రశంసలు పొందడం మా అదృష్టం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు' అని పోస్ట్ చైతన్య, శోభిత తమతమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు.
Latest News