![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 08:45 AM
'అదృశ్యం - ది ఇన్విజిబుల్ హీరోస్' సిరీస్, క్రితం ఏడాది ఏప్రిల్ 11వ తేదీన 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అయింది. ఐజాజ్ ఖాన్ - దివ్యంకా త్రిపాఠి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి అన్షుమాన్ కిశోర్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాంటి సిరీస్ నుంచి ఇప్పుడు సీజన్ 2 రావడానికి సిద్ధమవుతోంది. 'అదృశ్యం 2 - ది ఇన్విజిబుల్ హీరోస్' పేరుతో ఈ సిరీస్ ప్రేక్షకులను పలకరించనుంది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్ గా 'సోనీ లివ్'లో అందుబాటులోకి రానుంది. ఐజాజ్ ఖాన్ - పూజా గోర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ పై అందరిలో ఆసక్తి ఉంది. రీసెంటుగా వదిలిన ఈ సిరీస్ ట్రైలర్ కి రెస్పాన్స్ బాగుంది. కథ విషయానికి వస్తే .. ముగ్గురు తీవ్రవాదులు కశ్మీర్ సరిహద్దుల గుండా రహస్యంగా ఇండియాలోకి ప్రవేశిస్తారు. ఇండియాలోని ప్రధానమైన నగరాలలో విధ్వంసం సృష్టించడానికి పకడ్బందీగా ప్రణాళిక రచన చేస్తారు. ఈ విషయానికి సంబంధించిన సమాచారం అందడంతో, ఇన్విజిబుల్ హీరోలు రంగంలోకి దిగుతారు. తీవ్రవాదులను వాళ్లు ఎలా ఎదుర్కొంటారు? వాళ్ల విధ్వంసాలను వీళ్లు ఆపగలిగారా లేదా అనేది మిగతా కథ.
Latest News