![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 09:23 PM
నితిన్, శ్రీలీల జంటగా వచ్చిన యాక్షన్ ఎంటర్టయినర్ మూవీ రాబిన్ హుడ్. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డేవిడ్ వార్నర్ ఇందులో ఓ అతిథి పాత్ర పోషించాడు. ఇటీవల ఈ సినిమా ఈవెంట్ హైదరాబాదులో జరిగితే, వార్నర్ కూడా వచ్చి సందడి చేశాడు. తాజాగా, రాబిన్ హుడ్ లో వార్నర్ ఎంట్రీకి సంబంధించిన మేకర్స్ ఒక ఇంట్రో వీడియో రిలీజ్ చేశారు. వార్నర్ ఒక డాన్ లా వ్యవహరించడం ఇందులో చూడొచ్చు. వార్నర్ పాత్ర పేరు డేవిడ్ భాయ్. చేతిలో తుపాకీ, చుట్టూ బికినీ గాళ్స్... లగ్జరీ బోట్ పై విహారాలు, హెలికాప్టర్ లో జర్నీలు... ఇలా ఇంట్రో వీడియోలో వార్నర్ రోల్ రిచ్ గా కనిపిస్తోంది.చివర్లో మరో వ్యక్తిని నీకు లాలీపాప్ కావాలా అని వార్నర్ అడగడం, నాకొద్దు అని ఆ వ్యక్తి తల అడ్డంగా ఊపడం... సీన్ కట్ చేస్తే ఆ వ్యక్తి చచ్చిపడి ఉండగా, అతడి నోట్లో లాలీపాప్ పెట్టిన వార్నర్... "లాలీపాప్స్ ఆర్ రెడ్... ఎనిమీస్ ఆర్ డెడ్" అని డైలాగ్ చెప్పడం అలరిస్తుంది.
Latest News