![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 09:25 PM
ప్రముఖ సినీ నటి స్నేహ వివాదంలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే... స్నేహ, ఆమె భర్త ప్రసన్న కుమార్ అరుణాచలం ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇద్దరూ కలిసి గిరి ప్రదక్షిణ చేశారు. ఆలయాల వద్ద కొబ్బరికాయలు కొడుతూ కాలినడకన గిరి ప్రదక్షిణ చేశారు. అయితే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వీరిద్దరూ కాళ్లకు చెప్పులు ధరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. దీంతో, స్నేహ, ప్రసన్నలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పులు వేసుకుని గిరి ప్రదక్షిణ చేయడం ఏమిటని భక్తులు మండిపడుతున్నారు. అపచారం చేశారని, ఇది మహా పాపమని వ్యాఖ్యానిస్తున్నారు. తెలియక చేసుంటారని స్నేహ దంపతులకు కొందరు అండగా నిలుస్తున్నారు.మన దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో అరుణాచలం ఒకటి. అరుణాచలం దర్శనానికి ముందు జీవితం వేరు, దర్శనం తర్వాత జీవితం వేరు అని భక్తులు భావిస్తుంటారు. గిరి ప్రదక్షిణ చేసి శివుడిని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందనేది భక్తుల నమ్మకం. ప్రతిరోజు ఎంతో మంది భక్తులు అరుణాచలం ఆలయాన్ని సందర్శిస్తుంటారు.
Latest News