![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 09:27 PM
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది. బాలీవుడ్ లో ఆమె చేసిన వెబ్ సిరీస్‌లు కూడా సూపర్ హిట్ అయ్యాయి. టాలీవుడ్ లో చివరగా ఆమె 'ఖుషి' సినిమాలో నటించింది. సామ్ నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 'త్రాలాలా మూవింగ్ పిక్షర్స్' పేరుతో ఆమె సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించింది. ఈ సంస్థ నుంచి తొలి చిత్రంగా 'శుభం' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో కామెడీతో పాటు హారర్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తోంది. శోభనం గదిలో భార్యాభర్తల మధ్య సరదా సంభాషణతో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పెళ్లికూతురు రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేస్తుంది. ఈ టైమ్ లో సీరియల్ చూడటం ఏమిటని పెళ్లికొడుకు అనగానే... పెళ్లి కూతురు 'ష్..' అంటూ సీరియస్ గా చూస్తుంది. టీజర్ ను మీరు కూడా చూడండి.
Latest News