![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 02:14 PM
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన తల్లిదండ్రుల మతాంతర వివాహం గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సల్మాన్, రష్మిక జంటగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఈ నెల 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.ఈ క్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ తన తల్లిదండ్రుల మతాంతర వివాహం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తమ కుటుంబంలో మతం అనేది సమస్య కాదని ఆయన స్పష్టం చేశారు. తన తల్లిదండ్రులు కూడా మతం విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పడలేదని పేర్కొన్నారు.తన తల్లి హిందూ మతంలో, తండ్రి ముస్లింగా పెరిగారని, ఇద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారని సల్మాన్ తెలిపారు. వారి మధ్య మతం విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని, ఇద్దరూ తమ కెరీర్లో ఎదగాలని ఆలోచించారే తప్ప మతం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని ఆయన వెల్లడించారు.తమ కుటుంబంలో మతం అనే అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదని, అందరూ కలిసి సంతోషంగా ఉంటామని ఆయన అన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడమే తమ ప్రధాన ఉద్దేశమని, మతం గురించి ఇబ్బంది పడటం తమకు ఇష్టం లేదని సల్మాన్ పేర్కొన్నారు.
Latest News