![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 02:12 PM
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు అటు తమిళం, తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాడు. అయితే తాజాగా విక్రమ్ నటించిన మూవీ 'వీరా ధీర శూరన్'. ఈ మార్చి 27న విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో పదేళ్ల తర్వాత విక్రమ్ ఖాతాలో విజయం నమోదైంది. ఎంపురాన్ సినిమాను తొలగించి మరికొన్ని ప్రదేశాల్లో విక్రమ్ సినిమాను ప్రదర్శిస్తున్నారు.కథలో విషయం లేకపోవడం డైరెక్టర్స్ వైఫల్యం వలన విక్రమ్‌కు విజయాలు వరించలేదు. మధ్యలో మణిరత్నం డైరెక్షన్ లో పొన్నియన్ సెల్వన్ లాంటి సినిమా వచ్చిన అది మల్టీస్టారర్ ఖాతాలోకి వెళుతుంది. ఇక పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన తంగలాన్ కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. ఇలా దశాబ్ద కాలంగా హిట్ అనే మాట వినలేదు విక్రమ్. అటు అభిమానులు కూడా తమ హీరో ఎప్పుడు హిట్ కొడతాడా అని ఎదురుచూస్తూనే ఉన్నారు.
Latest News