![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 06:21 PM
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్ హుడ్' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచి ఆసక్తి నెలకొంది. అందుకు కారణం గతంలో వెంకీ కుడుముల - నితిన్ కాంబినేషన్లో వచ్చిన 'భీష్మ' పెద్ద హిట్ కొట్టడమే. కొంత గ్యాప్ తరువాత ఈ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎంతవరకూ ఆడియన్స్ కి కనెక్ట్ అయిందనేది చూద్దాం.
కథ: రామ్ (నితిన్) ఓ అనాథ. అతను అనాథ ఆశ్రమంలోనే పెరుగుతాడు. తనవంటి అనాథల పోషణ కోసం మూర్తి (శుభలేఖ సుధాకర్) ఎంతగా కష్టపడుతున్నది రామ్ గమనిస్తాడు. సమాజంలో సాయం చేసేవారు తక్కువ .. సాయం చేస్తున్నట్టుగా నటించేవారు ఎక్కువ అనే విషయం అతనికి అర్థమవుతుంది. దాంతో అక్రమ మార్గాల్లో కూడబెడుతున్నవారి నుంచి దొంగతనాలు చేసి, అనాథశరణాలయాలకు ఆ డబ్బు పంపిస్తూ 'రాబిన్ హుడ్' గా మారిపోతాడు. అలా రాబిన్ హుడ్ కారణంగా పెద్ద మొత్తంలో పోగొట్టుకున్నవారిలో హోమ్ మినిస్టర్ (ఆడుకాలం నరేన్) సన్నిహితుడు కూడా ఉంటాడు. దాంతో వెంటనే హోమ్ మినిస్టర్ జోక్యం చేసుకుంటాడు. రాబిన్ హుడ్ ను పట్టుకోవడనికి స్పెషల్ ఆఫీసర్ విక్టర్ (షైన్ టామ్ చాకో)ను రంగంలోకి దింపుతాడు. తనదైన స్టైల్లో అతను రాబిన్ హుడ్ ను పట్టుకోవడానికి వ్యూహాలు పన్నుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాలో శ్రీమంతుడైన అభినవ్ వాసుదేవ్ (షిజు) కూతురే 'నీరా'. తన కాళ్లపై తాను నిలబడాలనే స్వభావం ఆమెది. ఒక రోజున ఆమెకి ఇండియాలోని 'రుద్రకొండ' నుంచి ఒక కాల్ వస్తుంది. సామి (దేవదత్త నాగే) అనుచరులు 'నీరా' బంధువులను బెదిరించి ఆమెకి కాల్ చేయిస్తారు. దాంతో తనవాళ్లు ఆపదలో ఉన్నారని భావించిన 'నీరా' వెంటనే 'రుద్రకొండ'కి బయల్దేరుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? సామి అనే దుర్మార్గుడికి 'నీరా'తో పని ఏంటి? ఆమెకి రాబిన్ హుడ్ ఎలా తారసపడతాడు? అనేది మిగతా కథ.
Latest News